![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -274 లో..... సీతాకాంత్ ఆస్తి పేపర్స్ శ్రీలతకి ఇస్తుండగా.. అప్పుడే పేపర్స్ మంటలో పడిపోతాయ్. దాంతో అందరు షాక్ అవుతారు. అప్పుడే ఒకతను వచ్చి గుడిలో తప్పు జరుగుతుంటే ఎలా చూస్తూ ఉంటాడు. ఆ దేవుడు అందుకే ఇలా ఆ ఆస్తులు తన పేరున ఉంటే తను ఉండదని అతను అనగానే.. మా అమ్మకి ఏం కాకూడదు. ఆస్తులు ఎప్పటికి తన పేరున రాయనని సీతాకాంత్ అంటాడు. దాంతో శ్రీవల్లి, సందీప్ లు షాక్ అవుతారు.
ఆ తర్వాత శ్రీలతతో.. శ్రీవల్లి, సందీప్ లు మాట్లాడతారు. ఏంటి అత్తయ్య అలా మారిపోయారని శ్రీవల్లి అనగానే.. అమ్మ నేను తప్పు చేసాను.. ఆ సిచువేషన్ డబ్బు కావాలా అమ్మ కావాలా అన్నప్పుడు డబ్బు అన్నాను.. ఒకవేళ నేను అలా అనకుంటే నీ గురించి కూడా తెలిసేదని అందుకే అలా చెప్పానని సందీప్ అంటాడు. ఆ తర్వాత నేను ఎందుకు మారిపోయాను.. మారిపోలేదు అలా నటించానని శ్రీలత అనగానే.. సందీప్, శ్రీవల్లిలు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్లతో మంచిగా ఉంటూనే వాళ్ళని మోసం చెయ్యాలని శ్రీలత అంటుంది.
మరొకవైపు సీతాకాంత్ తన గదిని అందంగా డెకరేషన్ చేస్తాడు. రామలక్ష్మి రాగానే తన ప్రేమని ఎక్స్ ప్రెస్ చేసి తనకి దగ్గర అవుతాడు. మరుసటి రోజు ఉదయం శ్రీలత పూజ చేస్తుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి.. అత్తయ్య మీరు పూజ చేసారా అని ఆశ్చర్యపడుతుంది. తను మారిపోయిందని రామలక్ష్మిని నమ్మిస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ రెడీ అవుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వెళ్లి తనని ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |